News December 15, 2024

ఇచ్చోడ : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

image

ఇచ్చోడ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. నేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు రుణమాఫీ, రైతుకు గిట్టుబాటు ధర, సన్నవడ్లకు బోనస్, ప్రతి గింజ ప్రభుత్వమే కొనే విధంగా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.

Similar News

News November 8, 2025

తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

image

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తాంసి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

News November 8, 2025

గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

image

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్‌కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్‌ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.