News December 15, 2024

రాజమండ్రి: 16న యధావిధిగా పీజీఆర్ఎస్

image

రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 16న యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లా ప్రజలందరూ గమనించాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News November 28, 2025

రాజానగరం: ధాన్యం కొనుగోళ్లపై జేసీ ఆరా

image

రాజానగరం మండలంలోని జి. ఎర్రంపాలెంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి పండించిన రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ శుక్రవారం స్వయంగా మాట్లాడారు. పంట దిగుబడి వివరాలను తెలుసుకున్న ఆయన.. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు తోలిన ధాన్యానికి సంబంధించిన నగదు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుందా లేదా అని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News November 28, 2025

రాజమండ్రి: అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

image

అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, సమయపాలన కచ్చితంగా పాటించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. శుక్రవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, రోజువారీ హాజరుపై ఆరా తీశారు. పేదలకు అందించే భోజనం ఎల్లప్పుడూ నాణ్యతగా ఉండేలా చూస్తూ, మెనూను తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశించారు.

News November 28, 2025

మారిన తూ.గో స్వరూపం.. పెరిగిన ఓటర్ల సంఖ్య

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. మండపేట నియోజకవర్గం అదనంగా చేరడంతో జిల్లాలో మండలాల సంఖ్య 21కి, నియోజకవర్గాల సంఖ్య ఏడు నుంచి ఎనిమిదికి పెరిగాయి. నవంబర్ 11 నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 16,23,528 ఉండగా, మండపేట నియోజకవర్గం చేరికతో మొత్తం ఓటర్ల సంఖ్య 18,37,852 కు పెరిగింది.