News December 15, 2024
ట్రైన్‌లో నుంచి మీ వస్తువు పడిపోయిందా.. వెంటనే ఇలా చేయండి?

రైలులో నుంచి మీ వస్తువులు ఏవైనా కిందపడిపోతే వెంటనే చైన్ లాగకూడదు. ఆ వస్తువు పడిన దగ్గర్లోని పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్న పోల్ నంబర్ నోట్ చేసుకోవాలి. ఆ వెంటనే టీసీని సంప్రదించి పోల్ నంబర్, ముందూ వెనుక ఉండే రైల్వే స్టేషన్ల నంబర్లు టీసీ, ఆర్పీఎఫ్ అధికారులకు చెప్పాలి. లేదంటే 182 లేదా 139కు కాల్ చేసి తెలపాలి. పోల్ నంబర్ ఆధారంగా పోయిన మీ వస్తువును వారు వెతికి తీసుకువచ్చి అప్పగిస్తారు.
Similar News
News December 30, 2025
రేపు బయటికి రావద్దు!

ఇందుకు 2 కారణాలున్నాయి. ఒకటి తెలుగు రాష్ట్రాల్లో రేపు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉదయం, రాత్రివేళల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పింది. ఇక 31st కావడంతో పార్టీలు చేసుకునేవారూ ఇళ్లలోనే ఉండటం బెటర్. రేపు HYDతో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో పోలీసులు పెద్దఎత్తున డ్రంకెన్ డ్రైవ్ చేపట్టనున్నారు. మద్యం సేవించినవారు వాహనాలపై బయటికి రావద్దని సూచిస్తున్నారు.
News December 30, 2025
పడిపోయిన ద్రవ్యోల్బణం.. ఇరాన్‌లో ఆందోళనలు

ఇరాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ కరెన్సీ దారుణంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 1.38 మిలియన్లకు దిగజారిపోయింది. అణు ఆంక్షల వల్ల ఇరాన్ పరిస్థితి అతలాకుతలం అయ్యింది. కరెన్సీ పడిపోవడంతో ద్రవ్యోల్బణం 42.2%కి చేరింది. ఆహార పదార్థాల ధరలు 72% పెరిగాయి. దీంతో టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్, మష్హద్ సిటీల్లో జనం నిరసనబాట పట్టారు. సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మహ్మద్ రెజా రాజీనామా చేశారు.
News December 30, 2025
WPL: RCB నుంచి పెర్రీ ఔట్

JAN 9 నుంచి మొదలయ్యే WPLకు ముందు RCBకి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ సీజన్‌కు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. పెర్రీ ప్లేస్‌లో IND ఆల్‌రౌండర్ సయాలీ సత్‌ఘరేను తీసుకున్నట్లు RCB తెలిపింది. 2024లో బెంగళూరు టైటిల్ సాధించడంలో పెర్రీ కీ రోల్ పోషించారు. అటు అన్నాబెల్ సదర్లాండ్(ఢిల్లీ), తారా నోరీస్(యూపీ వారియర్స్) కూడా WPLకు దూరమయ్యారు.


