News December 15, 2024
ప్రభాస్ ‘స్పిరిట్’లో మృణాల్ ఠాకూర్?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ సినిమా గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు, కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కనిపించనున్నట్లు హిందీ వెబ్‌సైట్లు రాసుకొచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని, ఈ ముగ్గురిలో ఎవరితోనూ చర్చలు కూడా జరగలేదని మూవీ టీమ్ స్పష్టతనిచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
Similar News
News March 19, 2026
వారికి ఉచితంగా బిందు సేద్య పరికరాలు

APలోని 8 జిల్లాల్లో FRA(ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) పట్టాదారులకు 100% రాయితీపై బిందు, 90% రాయితీతో తుంపర సేద్యం పరికరాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అల్లూరి, ఏలూరు, మన్యం, నంద్యాల, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 2.30 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కింద ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
News March 19, 2026
కవిత కొత్త పార్టీ.. పేరు ఇదే

TG: జాగృతి చీఫ్ కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆమె జనవరి 23నే దరఖాస్తు చేశారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దరఖాస్తులో లోపాలున్నాయని ECI తరఫు న్యాయవాది FEB 27న న్యాయస్థానానికి తెలిపారు. ఈ అంశంపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.
News March 19, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,780 తగ్గి రూ.1,54,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,550 పతనమై రూ.1,41,750గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


