News December 15, 2024

ఎస్సై ఆత్మహత్య కేసులో ట్విస్ట్

image

TG: ములుగు(D) వాజేడు SI హరీశ్ <<14767070>>ఆత్మహత్య<<>> కేసులో అనసూర్య అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేటకు చెందిన ఆమె రాంగ్ కాల్ ద్వారా ఆయనకు పరిచయమైంది. తరచూ ఫోన్ చేస్తూ సాన్నిహిత్యం పెంచుకొని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. హరీశ్ అందుకు నిరాకరించారు. తనను శారీరకంగా వాడుకున్నాడంటూ మీడియాకు, ఉన్నతాధికారులకు చెబుతానని ఆమె బెదిరించడంతోనే హరీశ్ రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయాడని పోలీసులు తెలిపారు.

Similar News

News October 30, 2025

NLG: మోంథా ఎఫెక్ట్… రైళ్ల రద్దు

image

మోంథా తుపాన్ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. సికింద్రాబాద్ నుంచి NLG మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్మభూమి, విశాఖ, ఫలక్ నుమా రైళ్లు బుధవారం కొంత ఆలస్యంగా నడిచాయి. ఇవాళ ఉదయం రావాల్సిన పల్నాడు ఎక్స్ప్రెస్ రద్దయినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

News October 30, 2025

APPLY NOW: MGAHVలో ఉద్యోగాలు

image

మహాత్మాగాంధీ అంతర్ రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం 23 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://hindivishwa.org/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News October 30, 2025

గుమ్మడి కాయలను ఎప్పుడు కోస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి?

image

గుమ్మడి పంట నాటిన 75 నుంచి 80 రోజులకు గుమ్మడి తీగపై కాయలు ఏర్పడతాయి. లేత కాయలు త్వరగా చెడిపోతాయి. కాబట్టి బాగా ముదిరి, పండిన కాయలనే కోయాలి. ముదిరిన కాయలు 4 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి ఎంత దూరపు మార్కెట్‌కైనా సులభంగా తరలించవచ్చు. కాయల్ని తొడిమతో సహా కోసి, కొన్ని రోజుల పాటు ఆరనివ్వాలి. కోసిన కాయలను శుభ్రపరచి సైజులను బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు పంపాలి.