News December 15, 2024

సంక్రాంతి సంబరం.. సరిగ్గా మరో నెల

image

సంక్రాంతి సంబరాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ప్రకృతి సోయగాలతో అలరించే ఇక్కడి పల్లెటూర్లు పండుగ శోభతో మరింత వన్నె సంతరించుకుంటాయి. రక్తి కట్టించే కోళ్ల పందేలతో తూ.గో, ప.గో జిల్లాల పేర్లు తెలుగు రాష్ట్రాల్లో మోత మోగుతాయి. కొత్త అల్లుళ్లకు చేసే వినూత్న మర్యాదలు మరో స్పెషల్ ఎట్రాక్షన్. రంగ వల్లులు, ఉత్సవాలు, ఉద్యోగాలకు పట్నం వెళ్లి వారి తిరిగి రాకతో సరిగ్గా మరో నెలలో పల్లెలు కళకళలాడనున్నాయి.

Similar News

News August 19, 2025

రాజమండ్రి: నకిలీ దస్తావేజులు సృష్టించే ముఠా అరెస్ట్

image

నకిలీ దస్తావేజులు సృష్టించి ఆస్తులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య తెలిపారు. రాజమండ్రికి చెందిన గొల్లపల్లి కాశీ విశాలాక్షి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు చేపట్టిన విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కవలగొయ్యిలోని విశాలాక్షి ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మివేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

News August 19, 2025

ధవళేశ్వరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను పరిశీలించిన కలెక్టర్

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మంగళవారం పరిశీలించారు. ఈ కేంద్రాన్ని ఆగస్టు 20న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేశ్ ప్రత్యక్షంగా పాల్గొని శిలాఫలకం ఆవిష్కరించి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News August 19, 2025

రాజమండ్రి: కోర్టుల్లో ఉద్యోగాలకు 20 నుంచి పరీక్షలు

image

జిల్లాలోని కోర్టుల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఈ నెల 20 నుంచి 24 వరకు ఈ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళవారం రాజమండ్రిలో తెలిపారు.