News December 15, 2024

బూమ్ బూమ్ బుమ్రా.. 5 వికెట్లు

image

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోమారు 5 వికెట్ల ప్రదర్శన చేశారు. ఖవాజా, మెక్‌స్వీనీ, స్మిత్, మార్ష్, హెడ్ వికెట్లను బుమ్రా దక్కించుకున్నారు. మిగిలిన బౌలర్లందరూ తేలిపోయిన చోట బుమ్రా ఒక్కరే వికెట్లతో చెలరేగడం గమనార్హం. 87 ఓవర్ మార్కు దాటే సరికి ఆస్ట్రేలియా స్కోరు 327/6గా ఉంది.

Similar News

News February 6, 2025

రోహిత్ పరుగుల దాహం తీరనుందా?

image

ఇంగ్లండ్‌తో రేపు వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ ఫ్యాన్స్ SMలో సందడి చేస్తున్నారు. గత 14 వన్డేల్లో హిట్‌మ్యాన్ రికార్డ్ స్థాయిలో రన్స్ చేశారని, అందులో సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నట్లు గుర్తుచేస్తున్నారు. అదే ఫామ్ కొనసాగించి పరుగుల వరద పారిస్తారని పోస్టులు పెడుతున్నారు. BGTలో ఇబ్బంది పడిన రోహిత్ ఇంగ్లండ్‌పై పరుగుల దాహం తీర్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ COMMENT.

News February 6, 2025

నిద్రలో మూత్రం ఆపుకుంటున్నారా?

image

మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో మూత్రం ఎక్కువగా వస్తుంది. రాత్రిళ్లు మూత్రం వచ్చినా నిద్ర డిస్టర్బ్ అవుతుందని చాలా మంది బద్ధకిస్తారు. ఇది ప్రమాదకరమని, బ్లాడర్ మీద ప్రెషర్ పెరిగి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మూత్రం ఎక్కువ సమయం ఆపితే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనమవుతాయని, కాలక్రమేణా మూత్రాశయం పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. మూత్రం రాగానే పాస్ చేయాలని సూచిస్తున్నారు.

News February 5, 2025

ఓసీల జనాభా తగ్గి, బీసీల జనాభా పెరిగింది: మంత్రి ఉత్తమ్

image

TG: కులగణనలో బీసీ జనాభా తగ్గిందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ ఫైరయ్యారు. గత గణాంకాలతో పోలిస్తే బీసీ జనాభా పెరిగిందని తెలిపారు. BRS పాలనలో 51.09%గా నమోదైన బీసీ జనాభా శాతం ఇప్పుడు 56.33%కు పెరిగిందన్నారు. ఓసీల జనాభా 21.55% నుంచి 15.79%కు తగ్గిందని చెప్పారు. ఈ సర్వే ద్వారా అందిన గణాంకాలను పాలన, సంక్షేమ విధానాల్లో వినియోగిస్తామని మంత్రి వివరించారు.

error: Content is protected !!