News December 15, 2024
మహేశ్ బాబు సరసన ప్రియాంకా చోప్రా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర బృందం ఆమెను సంప్రదించినట్లు టాక్. ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్, బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
Similar News
News February 5, 2025
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన
హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి ఈరోజు తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. అప్పటి నుంచీ విమానం కోసం ఎయిర్‌పోర్టులో పడిగాపులు గాస్తున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇంకా రాలేదని, కనీసం సరైన సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవని మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శన సమయం దాటిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 5, 2025
Stock Markets: నెగటివ్ సంకేతాలొచ్చినా లాభాల్లోనే..
దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,779 ( +40), సెన్సెక్స్ 78,609 (+33) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలే అందినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. మీడియా, మెటల్, బ్యాంకు, ఫైనాన్స్, O&G షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. BPCL, INDUSIND BANK, ONGC, HINDALCO, SHRIRAM FIN టాప్ గెయినర్స్. ASIANPAINT, NESTLE, TITAN, EICHER టాప్ లూజర్స్.
News February 5, 2025
ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ
‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 14లోపు ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని సమాచారం. వరుణ్ ధావన్, కీర్తి, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇది విజయ్ ‘తేరీ’(పోలీసోడు) సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.