News December 15, 2024
రేపు సభ ముందుకు రెండు కీలక బిల్లులు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 నుంచి 11 వరకు తొలుత ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సభ్యులు సంతాపం తెలియజేస్తారు. రేపు సభలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీల సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
Similar News
News February 5, 2025
23న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు
AP: శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19- మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా CM చంద్రబాబు 23న స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తోంది. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నారు. అటు శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
News February 5, 2025
Stock Markets: మీడియా, మెటల్, PSU బ్యాంకు షేర్లు అదుర్స్
దేశీయ స్టాక్‌మార్కెట్లు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. నిఫ్టీ 23,696 (-42), సెన్సెక్స్ 78,271 (-312) వద్ద క్లోజయ్యాయి. FMCG, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు ఎరుపెక్కాయి. మీడియా, మెటల్, PSU బ్యాంకు, O&G షేర్లు ఎగిశాయి. హిందాల్కో, ITC హోటల్స్, ONGC, అపోలో హాస్పిటల్స్, BPCL టాప్ గెయినర్స్.
News February 5, 2025
ఇలా చేస్తే ₹14లక్షల వరకు Zero Income Tax
కొత్త పన్ను విధానంలో ఉన్న ఏకైక మినహాయింపు NPS. సెక్షన్ 80CCD ప్రకారం బేసిక్ శాలరీలో 14% వరకు లబ్ధి పొందొచ్చు. దీనికి ₹75K స్టాండర్డ్ డిడక్షన్ తోడైతే దాదాపుగా ₹14L వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. Ex. CTC ₹13.75L, బేసిక్ ₹7.16L (CTCలో 50%) అనుకుందాం. అందులో NPS ₹1.1L (బేసిక్‌లో 14%), SD ₹75K తీసేస్తే మిగిలేది ₹11.9L. ఇది Taxable Income ₹12.1L కన్నా తక్కువే.