News December 15, 2024

జమిలి ఎన్నిక‌ల‌కు మాయావ‌తి మ‌ద్ద‌తు

image

జమిలి ఎన్నికల‌కు BSP చీఫ్ మాయావ‌తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల ఖ‌ర్చులు త‌గ్గ‌డ‌మే కాకుండా, ప‌థ‌కాల అమ‌లుకు ఆటంకాలు తప్పుతాయన్నారు. SC, STల‌కు ప్రమోషన్లలో రిజ‌ర్వేష‌న్ల‌ను వ్యతిరేకించిన INC, SPలు రిజర్వేషన్లపై సైలెంట్‌గా ఉండాలన్నారు. SC, ST, OBC రిజ‌ర్వేష‌న్ల‌ను మార్చ‌కుండా 9వ షెడ్యూల్‌లో చేర్చాల‌ని డిమాండ్ చేశారు. BJP కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని మాయావతి మండిపడ్డారు.

Similar News

News October 19, 2025

DRDOలో 50 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

DRDO ఆధ్వర్యంలోని ప్రూప్& ఎక్స్‌పెరిమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో 50 అప్రెంటిస్‌లకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/

News October 19, 2025

‘K-Ramp’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్‌సైట్ తెలిపింది. ఇండియాలో రూ.2.15 కోట్లు(నెట్ కలెక్షన్స్) వసూలు చేసినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 37.10% ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు వెల్లడించింది.

News October 19, 2025

తొలి వన్డే.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

image

పెర్త్‌లో జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత్ తొలి వన్డేకు వరుణుడు ఆటంకం కలిగించాడు. 9వ ఓవర్ నడుస్తుండగా వర్షం పడటంతో మ్యాచ్ ఆపేశారు. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(2), అక్షర్ పటేల్(0) ఉన్నారు. రోహిత్, కోహ్లీల తర్వాత గిల్(10) కూడా ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 25/3గా ఉంది.