News December 15, 2024
బిగ్‌బాస్ నుంచి అవినాశ్ ఎలిమినేట్

బిగ్‌బాస్ సీజన్-8 నుంచి కమెడియన్ అవినాశ్ ఎలిమినేట్ అయ్యారు. టాప్-5లో ఉన్న ఆయన ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ సీజన్ మధ్యలో హౌస్‌లోకి వచ్చిన అవినాశ్, తన కామెడీతో అందరినీ అలరించారు. ఫినాలే గెస్టుల్లో ఒకరైన కన్నడ నటుడు ఉపేంద్ర హౌస్‌లోకి వెళ్లి ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. కాగా అవినాశ్ గతంలోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఉన్నారు.
Similar News
News January 1, 2026
IIT హైదరాబాద్ కుర్రాడికి ₹2.5 కోట్ల ప్యాకేజీ!

జాబ్ మార్కెట్ డల్‌గా ఉన్నా IIT హైదరాబాద్ స్టూడెంట్ ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ హిస్టరీ క్రియేట్ చేశాడు. నెదర్లాండ్స్‌కు చెందిన ‘ఆప్టివర్’ అనే కంపెనీలో ఏకంగా ₹2.5 కోట్ల ప్యాకేజీ అందుకున్నాడు. సంస్థ చరిత్రలోనే ఇది హయ్యెస్ట్ ఆఫర్. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఎంపికైన ఈ 21 ఏళ్ల కుర్రాడు తన ఇంటర్న్‌షిప్‌ను ఏకంగా భారీ జాబ్‌గా మార్చుకున్నాడు. ఈ ఏడాది IITHలో సగటు ప్యాకేజీ 75% పెరిగి ₹36.2 లక్షలకు చేరడం విశేషం.
News January 1, 2026
CM పర్యటనలపై వాస్తవాలు చెప్పాలి: సుధాకర్

AP: CM CBN విదేశీ పర్యటనలపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని YCP నేత సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. ‘GADలోనూ సమాచారం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి సింగపూర్ వెళ్లి ఉంటారనే ప్రచారం ఉంది. CM, లోకేశ్, పవన్‌ల పర్యటనల ఖర్చును వెల్లడించాలి. తన సొంత డబ్బుతో మాజీ CM జగన్ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్తే నానా యాగీ చేసిన CBN CMగా తన పర్యటనను రహస్యంగా ఉంచడంలో మర్మమేమిటి’ అని ప్రశ్నించారు.
News January 1, 2026
సౌదీలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష

సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు రికార్డు స్థాయికి చేరింది. 2025లో ఏకంగా 356 మందికి మరణ దండన అమలు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్ రవాణాపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం శిక్షల్లో 243 డ్రగ్స్ కేసులే కావడం గమనార్హం. ఓవైపు పర్యాటకం, క్రీడలతో ఆధునిక దేశంగా ఎదగాలని యత్నిస్తున్న సౌదీ, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


