News December 16, 2024
అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు.. నెట్టింట భిన్నాభిప్రాయాలు

తొక్కిసలాట కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అల్లు అర్జున్‌ను సినీ ప్రముఖులు కలవడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీలో టాప్ హీరో జైలుకు వెళ్లడం సంచలనంగా మారగా ఆయనను సినీ ప్రముఖులు కలవడంలో తప్పు లేదని కొందరు అంటున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడిని, తల్లిని కోల్పోయిన చిన్నారిని కలిసిన వారే లేరని కొందరు పెదవి విరుస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 15, 2026
ఆమిర్ ఖాన్ కొడుకు సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన హీరోయిన్ సాయిపల్లవి నటిస్తున్నారు. ‘ఏక్ దిన్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. రేపు టీజర్ రిలీజ్ కానుంది. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్నారు. కాగా సాయిపల్లవి రణ్‌బీర్ ‘రామాయణ’లోనూ నటిస్తుండగా ఈ మూవీ దీపావళికి రిలీజ్ కానుంది.
News January 15, 2026
ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు.
News January 15, 2026
ఐఐటీ రూర్కీలో నాన్ టీచింగ్ పోస్టులు

<


