News December 16, 2024

శుభ ముహూర్తం (16-12-2024)

image

తిథి: బహుళ పాడ్యమి మ.1:49 వరకు
నక్షత్రం: ఆరుద్ర తె.3.03 వరకు
శుభ సమయం: ఉ.6 నుంచి ఉ.7 గంటల వరకు
రాహుకాలం: ఉ.7:30 నుంచి ఉ.9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుంచి మ.12:00 వరకు
వర్జ్యం: ఉ.11.46 నుంచి మ.1.20 గంటల వరకు
దుర్ముహూర్తం: మ.12.24 నుంచి మ.1.02 గంటల వరకు
తిరిగి మ.2.46 నుంచి మ.3.34 గంటల వరకు
అమృత ఘడియలు: సా.5.51 నుంచి రా.7.23 వరకు

Similar News

News November 11, 2025

ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర!

image

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో <<18253113>>పేలుడు<<>>పై కొత్వాలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడిగా అనుమానిస్తూ ఉపా చట్టం సెక్షన్ 16, 18 కింద రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పేలుడు నేపథ్యంలో పలు దేశాల ఎంబసీలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో ఉండొద్దని తమ దేశ పౌరులకు భారత్‌లోని యూఎస్, ఫ్రాన్స్ ఎంబసీలు అడ్వైజరీ జారీ చేశాయి.

News November 11, 2025

లంకలో హనుమంతుడు ఎడమ కాలు ఎందుకు మోపాడు?

image

ఆంజనేయుడు, రావణుడి అశుభాన్ని కోరి లంకలో ఎడమ పాదం మోపాడు. దాని ఫలితంగా లంక సర్వనాశనం అయింది. ఎడమ పాదం అశుభాలు, విభేదాలకు దారి తీస్తుంది. దీనికి విరుద్ధంగా, మన సంప్రదాయం ప్రకారం కుడిపాదం మోపి ఇంట ప్రవేశించడం సకల శుభాలకు, సంపదకు ప్రతీక. ముఖ్యంగా కొత్త కోడలు అత్తవారింట కుడి కాలు మోపడం వలన శాంతి, ఉన్నతి, సంతోషం కలుగుతాయి. కాబట్టి, ఇతరుల బాగును, క్షేమాన్ని కోరుతూ ఎల్లప్పుడూ కుడిపాదాన్నే ఉపయోగించాలి.

News November 11, 2025

రోడ్లపై గుంతలు లేకుండా చేయండి: చంద్రబాబు

image

AP: రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా వాహనం నడుపుతున్న వారికి అవగాహన కల్పించాలని, అవసరమైతే వారి మొబైల్స్‌కి సందేశాలు పంపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు.