News December 16, 2024
డిసెంబర్ 16: చరిత్రలో ఈరోజు

1912: సినీ దర్శకుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు జననం
1949: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి జననం
1951: సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభం
1971: ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటు
* విజయ్ దివస్ (1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ విజయం)
Similar News
News July 5, 2025
40 ఏళ్ల వయసు.. IVFతో తల్లి కాబోతున్న నటి!

IVF ద్వారా తాను కవలలకు తల్లి కాబోతున్నట్లు కన్నడ నటి భావన రామన్న ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. ‘20, 30 ఏళ్ల వయసులో నాకు తల్లి కావాలనే కోరిక ఉండేది కాదు. 40 ఏళ్లకు వచ్చేసరికి ఆ కోరిక తీరడం కష్టమైపోయింది. చాలా IVF క్లినిక్‌లు తిరస్కరించాయి. నా తండ్రి, తోబుట్టువులు, ప్రియమైన వారు నాకు అండగా నిలిచారు. నా పిల్లలకు తండ్రి లేకపోవచ్చు. కానీ వారు గర్వపడేలా పెంచుతాను’ అని అవివాహితైన ఆమె రాసుకొచ్చారు.
News July 5, 2025
ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి

TG: మహిళలకు ఐదేళ్లలో ₹లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు ఈనెల 12 నుంచి 18 వరకు వడ్డీ లేని రుణాల నగదును చెక్కుల రూపంలో పంపిణీ చేస్తామన్నారు. ప్రతి ఏటా 20 వేల కోట్లకు తగ్గకుండా లోన్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించేందుకు సమాఖ్య సమావేశాలు నిర్వహించుకోవాలని మహిళా సంఘాలకు సూచించారు.
News July 5, 2025
అనుష్క ‘ఘాటీ’ విడుదల వాయిదా

అనుష్క, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘాటీ’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 11న విడుదల చేస్తామని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించగా, పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు తాజాగా తెలిపింది. ప్రేక్షకులకు మరింత ఉత్తమ సినిమాటిక్ అనుభవాన్ని పంచేందుకు సినిమాను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామంది.