News December 16, 2024
భారత్‌దే ఆసియా కప్.. ఒక్కో ప్లేయర్‌కు రూ.2లక్షలు

జూనియర్ ఉమెన్స్ హాకీ ఆసియా కప్ విజేతగా భారత జట్టు నిలిచింది. ఆదివారం చైనాతో జరిగిన ఫైనల్లో 3-2 తేడాతో విజయం సాధించింది. దీంతో జట్టులోని ఒక్కో ప్లేయర్‌కు రూ.2లక్షల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది. సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ.లక్ష చొప్పున ఇస్తామని తెలిపింది.
Similar News
News January 1, 2026
మీ త్యాగం వల్లే ఈ సెలబ్రేషన్స్.. సెల్యూట్❤️

లోకమంతా న్యూఇయర్ వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. మనం ఇక్కడ మిత్రులతో విందులు, వినోదాలతో ఎంజాయ్ చేస్తుంటే.. గడ్డకట్టే హిమపాతంలో కుటుంబానికి దూరంగా సైనికులు దేశం కోసం పహారా కాస్తున్నారు. వారు చేస్తున్న సేవ, త్యాగం వల్లే మనం సురక్షితంగా వేడుకలు జరుపుకోగలుగుతున్నాం. ఆ వీర జవాన్లందరికీ మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం.
News January 1, 2026
గత పాలకుల పాపాలతోనే సమస్యలు: అనగాని

AP: భూ రిజిస్ట్రేషన్లలో దొర్లిన లోపాల సవరణకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఎ.సత్యప్రసాద్ తెలిపారు. ‘గత పాలకుల కబ్జాలు, ఆక్రమణల పాపాల వల్ల ఈ సమస్యలు వచ్చాయి. రియల్టర్ల అక్రమాలతో డబుల్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్నీ కలెక్టర్లకే ఇచ్చాం. ఎవరు తప్పుచేసినా చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించడంపై అధ్యయనం చేస్తున్నామన్నారు.
News January 1, 2026
కొత్త సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ దాడి.. 24 మంది మృతి

రష్యా నియంత్రణలోని ఖేర్సన్లో నూతన సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఖోర్లీలోని ఒక హోటల్, కేఫ్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 24 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే నిప్పు అంటుకునే రసాయనాలతో ఈ దాడులు చేశారని, అర్ధరాత్రి వేళ పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదని ఆయన పేర్కొన్నారు.


