News December 16, 2024
GOOD NEWS.. ఇక ఆన్‌లైన్‌లోనే అన్ని సర్టిఫికెట్లు!

TG: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర సర్టిఫికెట్ల కోసం ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునేలా కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ పరిధిలో బర్త్, డెత్, మ్యారేజ్, హౌజ్ పర్మిషన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లే ఔట్ పర్మిషన్ వంటి 20 రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే అందించేలా ‘మై-పంచాయతీ’ యాప్‌ను రూపొందిస్తోంది. గ్రామ సమస్యలపై కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సమాచారం.
Similar News
News January 26, 2026
రేపు బ్యాంకులు బంద్!

బ్యాంక్ ఉద్యోగులు రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. వారంలో 5 వర్కింగ్ డేస్‌ను డిమాండ్ చేస్తూ బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 23న ఈ మేరకు ప్రకటన వెలువడింది. గత బుధవారం, గురువారం ఈ విషయంపై చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది! ఇప్పటికే పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తమ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చంటూ కస్టమర్లకు మెసేజ్‌లు పంపాయి.
News January 26, 2026
రాజ్యాంగంలో ప్రతి పేజీపై ‘PREM’.. ఆయన ఎవరంటే?

భారత రాజ్యాంగ మూల ప్రతిలో ప్రతి పేజీపై ‘ప్రేమ్’ అనే పేరు ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా? ఆయనెవరో కాదు.. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. రాజ్యాంగ మూల ప్రతిని తన చేతిరాతతో రాసిన కళాకారుడు. దాదాపు 6 నెలల సమయాన్ని కేటాయించి అందంగా రాశారు. 251 పేజీలలో రాజ్యాంగాన్ని పూర్తి చేయగా.. ఎటువంటి వేతనం తీసుకోలేదు. బదులుగా ప్రతి పేజీపై తన పేరు, చివరి పేజీలో తన తాత పేరును రాసుకునేలా ఒప్పందం చేసుకున్నారు.
News January 26, 2026
ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ అప్డేట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. RFCలో జరిగిన చిత్రీకరణలో నైట్ ఎఫెక్ట్ సీన్లు తీసినట్లు సినిమాటోగ్రఫీ విభాగంలో పనిచేస్తోన్న ప్రజ్వల్ ఇన్‌స్టాలో వెల్లడించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉంటాయని సినీవర్గాలు చెబుతున్నాయి. NTR కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమాగా ‘డ్రాగన్’ ఉండనున్నట్లు సమాచారం.


