News December 16, 2024
ఆ స్టార్లతో మూవీ చేయాలని ఉంది: అల్లరి నరేశ్
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ వంటి స్టార్లతో మూవీ చేయాలని ఉందని అల్లరి నరేశ్ చెప్పారు. ‘బచ్చలమల్లి’లో తనది సీరియస్ క్యారెక్టర్ అని తెలిపారు. సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయన్నారు. వచ్చే ఏడాది తన నుంచి రెండు కామెడీ చిత్రాలు వస్తాయని తెలిపారు. తన పాత్ర బాగుంటే మల్టీస్టారర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని పేర్కొన్నారు. గమ్యం, మహర్షి వంటి చిత్రాల్లో నరేశ్ కీలక పాత్రలో నటించారు.
Similar News
News February 5, 2025
రక్షణ మంత్రితో ముగిసిన లోకేశ్ భేటీ.. వాటికోసం విజ్ఞప్తి
AP: ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో NDA సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించిన లోకేశ్, రక్షణ రంగానికి సంబంధించిన పలు పెట్టుబడుల్ని APలో పెట్టాలని కోరారు. డిఫెన్స్ క్లస్టర్, రక్షణ రంగ పరికరాల తయారీలో కొన్ని యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయనకు రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు.
News February 5, 2025
రేపు ఢిల్లీకి కేటీఆర్ బృందం!
TG: ఈ నెల 10న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ నేపథ్యంలో రేపు ఢిల్లీకి KTR బృందం వెళ్లనుంది. 2, 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో వారు చర్చించనున్నారు. కేటీఆర్ వెంట వినోద్, దాసోజు శ్రవణ్ కుమార్ వెళ్లనున్నారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో చర్యలకు ఎంత సమయం తీసుకుంటారని సుప్రీం ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ సెక్రటరీ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.
News February 5, 2025
విదేశాలకు 47% పెరిగిన పళ్లు, కూరగాయల ఎగుమతులు
APEDA ఆర్థిక సహకారంతో గత ఐదేళ్లలో భారత్ నుంచి పళ్లు, కూరగాయాల ఎగుమతులు 47.3% పెరిగాయని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. విలువ పరంగా ఈ వృద్ధిరేటు 41.5% అని పేర్కొంది. FY 2023-24లో 123 దేశాలకు ఎగుమతులు చేరాయని వెల్లడించింది. రైతుల కోసం Intl ట్రేడ్ ఫెయిర్స్‌లో పాల్గొనడం, బయ్యర్ సెల్లర్ మీటింగ్స్ ఏర్పాటు, మార్కెట్ యాక్సెస్‌తో ఇది సాధ్యమైందని వివరించింది. గత మూడేళ్లలో 17 కొత్త మార్కెట్లలో ప్రవేశించామంది.