News December 16, 2024
ఇండియన్ సినిమాల్లో ‘పుష్ప-2’ మాత్రమే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. తాను నటించిన ‘పుష్ప-2’ సినిమా నిన్న రూ.104 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రిలీజైన 11వ రోజున రూ.100+ కోట్లు రాబట్టిన తొలి భారతీయ సినిమాగా నిలిచిందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ‘పుష్ప-2’ అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచినట్లు తెలుస్తోంది. ‘దంగల్’ తొలి స్థానంలో ఉండగా బాహుబలి-2 రెండో ప్లేస్‌లో ఉంది.
Similar News
News January 22, 2026
HEADLINES

* ‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CM CBN
* దావోస్‌లో కొనసాగుతున్న CM రేవంత్ టూర్
* అక్రమాలకు కేంద్రంగా సింగరేణి: కిషన్ రెడ్డి
* ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా: జగన్
* నైనీ కోల్ బ్లాక్ వివాదం.. రేవంత్‌తో బీజేపీ చీకటి ఒప్పందమన్న కేటీఆర్
* తొలి టీ20.. కివీస్‌పై భారత్ ఘన విజయం
* ఇవాళ 10గ్రా. బంగారం రూ.7వేలు, కేజీ వెండిపై రూ.5వేలు పెరిగిన ధర
News January 22, 2026
అభిషేక్… రికార్డులు షేక్

న్యూజిలాండ్‌తో తొలి T20లో అభిషేక్ శర్మ రికార్డ్ సృష్టించారు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు, 25 లేదా అంతకంటే తక్కువ బాల్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(8) చేసిన బ్యాటర్‌గా నిలిచారు. గతంలో సూర్య, సాల్ట్, లూయిస్‌తో(7 సార్లు) సంయుక్తంగా ఉన్న అభిషేక్ ఇవాళ వారిని అధిగమించారు. NZపై ఓ భారత్ బ్యాటర్ అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేయడంలోనూ ఘనత వహించారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో 50 కొట్టారు.
News January 22, 2026
అడిషనల్ కలెక్టర్ ఆస్తులు రూ.వందల కోట్లు

TG: గతనెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ACB ఇవాళ రైడ్స్ చేసింది. సోదాల్లో రూ.4.65Cr విలువైన విల్లా, ఒక ఫ్లాట్, 8 ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి పేపర్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. రూ.30లక్షల నగదు, 297 గ్రా. బంగారం, రూ.44.04 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.


