News December 16, 2024

GET READY: ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో సాంగ్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది. ‘తర్వాతి సాంగ్ గేమ్ ఛేంజర్‌ను సౌండ్ ఛేంజర్‌గా మారుస్తుంది’ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. దీంతో ఈ సాంగ్‌పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. DHOP అంటూ సాగే ఈ సాంగ్ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అవుతుందని, ఆ తర్వాత దీని గురించి ప్రపంచమే మాట్లాడుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 31, 2025

వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట.. ₹87,695 కోట్ల బకాయిలు ఫ్రీజ్!

image

వొడాఫోన్ ఐడియా (Vi)కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కంపెనీ చెల్లించాల్సిన ₹87,695 కోట్ల AGR బకాయిలను ప్రస్తుతానికి నిలిపివేస్తూ ఐదేళ్ల పాటు మారటోరియం ప్రకటించింది. ఈ బకాయిలను 2031 నుంచి పదేళ్ల కాలంలో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. టెలికం రంగంలో పోటీని కాపాడటానికి 20 కోట్ల మంది కస్టమర్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కంపెనీ ఆర్థిక కష్టాల నుంచి కోలుకునే అవకాశం ఉంది.

News December 31, 2025

పశువుల్లో పొదుగువాపు వ్యాధి లక్షణాలు

image

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో పొదుగువాపు వ్యాధి చాలా ప్రమాదకరమైనది. పశువుల షెడ్‌లోని అపరిశుభ్ర వాతావరణం, యాజమాన్య లోపాల వల్ల పాలిచ్చే పశువులకు ఇది సోకే అవకాశం ఎక్కువ. పొదుగు వాచిపోవడం, పాలు నీరులా మారడం, విరగడం, అందులో తెల్లటి ముక్కలు కనిపించడం, పశువులు పాలు పిండనీయకపోవడం వంటి లక్షణాలను బట్టి పశువుల్లో ఈ వ్యాధిని గుర్తించవచ్చు. పొదుగువాపు వల్ల పాల ఉత్పత్తి బాగా తగ్గుతుంది.

News December 31, 2025

స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

TG: SC విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టితో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ గడువు ముగియనుంది. దానిని MAR31 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉపసంచాలకులు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్, ఆపై చదువులు చదువుతున్న అర్హులైన SC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి రెన్యువల్/ఫ్రెష్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.