News December 16, 2024
ఈ ఏడాది కోహ్లీకి గుర్తుండిపోతుంది!

బ్యాట్ పట్టగానే పూనకంతో ఊగిపోయి సెంచరీలు చేసే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో తడబడ్డారు. ఆయన కెరీర్‌లోనే 2024లో అత్యల్ప బ్యాటింగ్ సగటును నమోదు చేసుకున్నారు. టెస్టుల్లో 25.06, వన్డేల్లో 19.33, టీ20ల్లో 18.00 యావరేజ్‌తో బ్యాటింగ్ చేశారు. దీంతో ఈ ఏడాదిని కోహ్లీతో పాటు ఆయన అభిమానులు మర్చిపోలేరంటూ క్రికెట్ వర్గాలు పోస్టులు పెడుతున్నాయి.
Similar News
News September 16, 2025
మేడారం గద్దెల విస్తరణలో వ్యూహాత్మకంగా ముందుకే..!

మేడారం వన దేవతల గద్దెల విస్తరణలో ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే జాతరలో ఇరుకైన ఈ ప్రాంగణం విస్తరణకు గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించగా సాధ్యం కాలేదు. ప్రస్తుత సర్కారు ప్రయత్నం మొదలు పెట్టింది. ఆదివాసీ సంఘాలు విబేధించడం, రాజకీయ ప్రమేయం పెరగడంతో మంత్రి సీతక్క వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన పూజారులతో కౌంటర్ ఇప్పిస్తున్నారు. విమర్శలకు చెక్ పెడుతున్నారు.
News September 16, 2025
పాక్‌కు అవమానం.. మాట ప్రకారం తప్పుకుంటుందా?

IND vs PAK మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని PCB చేసిన <<17717948>>ఫిర్యాదును<<>> రిజెక్ట్ చేసినట్లు ICC అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామన్న పాక్‌కు ఘోర అవమానం ఎదురైంది. మొన్న గ్రౌండ్లో ప్లేయర్లకు, ఇప్పుడు ఆ దేశ బోర్డుకు భంగపాటు తప్పలేదు. మాట మీద నిలబడి టోర్నీ నుంచి తప్పుకుంటే పాక్‌కు కనీస మర్యాదైనా దక్కుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News September 16, 2025
డబ్బు ఇస్తామన్నా తెచ్చుకోలేమా..? అధికారులపై ఫైరైన CM!

తెలంగాణ CM రేవంత్ కొందరు ఉన్నతాధికారులపై మండిపడ్డట్లు తెలుస్తోంది. గతవారం ఢిల్లీ టూర్లో కేంద్రమంత్రి గడ్కరీకి CM, TG అధికారులు ₹1600 కోట్ల పనుల DPR ఇచ్చారు. అప్పుడు వారితో ₹1600 కోట్లు కాదు.. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల DPR తెస్తే ₹20వేల కోట్లు ఇస్తామని గడ్కరీ అన్నారట. దీంతో డబ్బు ఇస్తామన్నా ఎందుకు డ్రాఫ్ట్ రెడీ చేయలేదని, సీనియర్ అధికారులై ఉండి ఏం లాభమని వారిపై రేవంత్ ఫైర్ అయ్యారని సమాచారం.