News December 16, 2024

మూడో రోజు ముగిసిన ఆట

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. రాహుల్(33*), రోహిత్ (0) క్రీజులో ఉన్నారు. ఇవాళ ఆటకు వాన ఆరు సార్లు అంతరాయం కలిగించింది. కాగా తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది.

Similar News

News January 21, 2026

బెంగళూరులో RCB మ్యాచులు ఉండవా?

image

కర్ణాటక ప్రభుత్వ <<18883529>>షరతుల<<>> నేపథ్యంలో బెంగళూరులో మ్యాచుల నిర్వహణకు RCB వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. 5 మ్యాచులు ముంబైలో, 2 రాయ్‌పూర్‌లో నిర్వహించాలని భావిస్తోందని సమాచారం. ఈ క్రమంలో తమ హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌ల నిర్వహణపై ఈ నెల 27లోగా తెలియజేయాలని RCBకి BCCI చెప్పినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడు, అస్సాం, బెంగాల్ ఎన్నికల డేట్ల ప్రకటన తర్వాతే IPL షెడ్యూల్ విడుదల కావొచ్చని తెలిపాయి.

News January 21, 2026

భూముల మార్కెట్ విలువలు పెంపు!

image

AP: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల <<13263246>>మార్కెట్ విలువలు<<>> పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి సవరించిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలోనూ అన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెంచింది. <<7981895>>గతేడాది<<>> కొత్త జిల్లా కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాల్లో 15-25% పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి నవంబర్ వరకు ₹7 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఎంత మేర పెంచుతారనే దానిపై త్వరలో క్లారిటీ రానుంది.

News January 21, 2026

రాష్ట్రంలో 220 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ (MD/MS/DNB/DrNB/DM/MCh) ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.68,900-రూ.2,05,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://apchfw.ap.gov.in * మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.