News December 16, 2024

వాలంటీర్ల నిరాహార దీక్ష

image

AP: తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్లు విజయవాడలో ఆందోళనకు దిగారు. గాంధీనగర్ అలంకార్ థియేటర్ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు 50 గంటల నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. వీరి దీక్షకు AISF మద్దతు తెలిపింది.

Similar News

News January 23, 2026

వర్సిటీల నిధులు, నియామకాలపై PUC ఛైర్మన్ సమీక్ష

image

రాష్ట్రంలో ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని PUC ఛైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అంబేడ్కర్ యూనివర్సిటీ, JNTU విజయనగరం, IIIT శ్రీకాకుళం యూనివర్సిటీల నిధుల వినియోగం, నియామకాలు, ఆదాయ-వ్యయాలు, పరిపాలనా పనితీరుపై సమీక్షించారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు పూర్తిగా విద్యార్థుల మేలు కోసం వినియోగించాలన్నారు.

News January 23, 2026

2 వారాలు షుగర్ మానేస్తే మ్యాజిక్ రిజల్ట్స్!

image

స్వీట్లు, కూల్ డ్రింక్స్‌ వంటి వాటిలోని చక్కెర మన బాడీని పాడు చేస్తోందని ఎయిమ్స్ డాక్టర్ సౌరభ్ సేథి చెప్పారు. కేవలం 14 రోజులు షుగర్ మానేస్తే అద్భుతమైన మార్పులు వస్తాయన్నారు. ‘ముఖంలో వాపు తగ్గి గ్లో వస్తుంది. ఇన్సులిన్ లెవల్స్ తగ్గి పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది. ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మాయమవుతాయి. హెల్తీ స్కిన్ కోసం ఇదో బెస్ట్ టిప్’ అని సూచించారు.

News January 23, 2026

స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 49 పోస్టులకు నోటిఫికేషన్

image

అహ్మదాబాద్‌లోని <>స్పేస్ <<>>అప్లికేషన్ సెంటర్ 49 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, ME/MTech/MSc/MS, BE/BTech ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sac.gov.in/