News December 16, 2024

శతాబ్దాల చరిత్ర కలిగిన చందిప్ప మరకత శివాలయం

image

శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో ఉన్న మహిమాన్వితమైన మరకత శివాలయానికో ప్రాముఖ్యత ఉంది. మరకత శివాలయాన్ని దర్శిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పర్లి వైద్యనాథుని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం చందిప్ప గ్రామంలో ఉంది. మరకత శివలింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. క్రీస్తు శకం 1076-1126 మధ్య చాలుక్య రాజు 6వ విక్రమాదిత్యుడు ప్రతిష్ఠించారని శాసనంలో ఉంది.

Similar News

News May 8, 2025

ఓయూ: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.

News May 7, 2025

హయత్‌నగర్: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

image

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News May 7, 2025

నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం 108వ స్థాపనా దినోత్సవాన్ని వేడుకలు ఇవాళ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో MLC ప్రొ.కోదండరాం, మాజీ ఎంపీ K.కేశవరావు, సీపీ CV ఆనంద్, గాయకుడు అందెశ్రీ, వీసీ ప్రొ.కుమార్ మోలుగారం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.