News December 16, 2024
తాండూర్: రైలు కిందపడి యువకుడి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734344973073_51991920-normal-WIFI.webp)
రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూర్ మండలం రేచినిలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మేడి సాయి కుమార్(22) తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. దీంతో తనకు ఎవరు లేరని మనోవేదనకు గురై సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News February 5, 2025
ADB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738756129250_20476851-normal-WIFI.webp)
ఆదిలాబాద్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లాండసాంగి గ్రామ సమీపంలోని రహదారిపై మహారాష్ట్ర పాటన్ బోరికి చెందిన షాలిక్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 5, 2025
గుడిహత్నూర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738747644415_51859030-normal-WIFI.webp)
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.
News February 5, 2025
ADB: రైలు పట్టాలపై పడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738733367067_1285-normal-WIFI.webp)
తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం రెంగన్వాడి గ్రామానికి చెందిన సిడం చిత్రు (57), విఠల్‌తో కలిసి రైలులో ఇటీవల దైవదర్శనానికి తిరుపతికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి చిత్రు మృతిచెందారు.