News December 16, 2024

పురిటినొప్పులతో గ్రూప్-2 పరీక్ష రాస్తున్న నిండు గర్భిణి

image

TG: నాగర్‌కర్నూల్ జడ్పీ హైస్కూల్‌లో నిండు గర్భిణి రేవతి గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యారు. అయితే ఎగ్జామ్ రాస్తుండగా ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. అయినా అలాగే పరీక్ష రాస్తుండగా సమాచారం తెలుసుకున్న అధికారులు కేంద్రం బయట అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. కేంద్రం లోపల ఓ ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచారు.

Similar News

News January 12, 2026

సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు విడుదల

image

ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. వాటిని <>వెబ్‌సైట్‌లో<<>> డౌన్‌లోడ్ చేసుకోవాలని NTA తెలిపింది. దేశవ్యాప్తంగా 464 కేంద్రాల్లో ఈ నెల 18న పరీక్ష జరగనుందని పేర్కొంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులుంటే 011-40759000, 011-69227700 నంబర్లలో, aissee@nta.ac.inలో సంప్రదించాలని సూచించింది. ఈ ఎగ్జామ్ ద్వారా 2026-27లో 6, 9 తరగతుల్లో ప్రవేశాలు కల్పించనుంది.

News January 12, 2026

ప్రభుత్వ సేవలన్నీ మనమిత్ర ద్వారానే అమలవ్వాలి: కాటమనేని

image

AP: అంతరాయం లేకుండా ప్రభుత్వ సేవలు అందించేందుకు అన్ని శాఖలు మనమిత్ర యాప్ ద్వారా వాటిని అమలు చేయాలని IT కార్యదర్శి కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు. ‘కొన్ని శాఖలు ఇప్పటికీ మాన్యువల్‌గా సేవలు కొనసాగిస్తున్నాయి. డేటా అనుసంధానం ప్ర‌క్రియ పూర్తి చేసి యూజ్ కేసెస్ సిద్ధం చేస్తున్నాం. AI ఆధారితంగా ఉప‌యోగ‌ప‌డే 98 కేసెస్‌ను ఇప్ప‌టికే సిద్ధం చేశాం. APR నాటికి పూర్తిగా వాటిని అందుబాటులోకి తెస్తాం’ అని తెలిపారు.

News January 12, 2026

కేంద్ర బడ్జెట్.. దేశ చరిత్రలో తొలిసారి..

image

ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ అదే రోజు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.