News December 16, 2024
ఏడాదితో పాటు జనరేషన్ కూడా మారిపోనుంది!

మరో 15 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, ఈసారి ఏడాదితో పాటు జనరేషన్ కూడా మారిపోనుంది. 2025 నుంచి జనరేషన్ బీటా ప్రారంభం కానుండగా ఇది 2039 వరకు ఉంటుంది. దీంతో 2025 జనవరి 1వ తేదీ నుంచి జన్మించేవారిని ఇకపై GEN Beta అని పిలవాలి. GEN Alpha నుంచే టెక్నాలజీలో ఎన్నో మార్పులు చూసిన మనం ఇక మరిన్ని మార్పులను చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ మీరు ఏ జనరేషన్?
Similar News
News September 16, 2025
రాష్ట్రంలో రోడ్ల కోసం రూ.868 కోట్లు మంజూరు

TG: రాష్ట్రానికి సెంట్రల్ రోడ్&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూ.868 కోట్లు మంజూరైనట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ’34 రోడ్డు, వంతెన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. కనెక్టివిటీని పెంచడం, స్టేట్ రోడ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇవి చేపట్టాం. తెలంగాణలో రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సమతుల్య ప్రాంతీయాభివృద్ధిపై కేంద్రం నిబద్ధతతో ఉంది’ అని తెలిపారు.
News September 16, 2025
‘షేక్ హ్యాండ్’ వివాదంలో పాక్‌కు మరో ఎదురుదెబ్బ!

ఆసియా కప్: పాక్ ప్లేయర్లకు సూర్య స్క్వాడ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. అది నిబంధనలకు విరుద్ధమని ICCకి PCB ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని, లేకపోతే UAEతో మ్యాచ్ ఆడమని పాక్ బెదిరించింది. పాక్ బెదిరింపులను ICC తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ‘అందులో మ్యాచ్ రిఫరీ పాత్ర లేదని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని MCC మాన్యువల్‌లో లేదు’ అని ICC తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
News September 16, 2025
హాస్టళ్ల నిర్మాణం-మరమ్మతులకు నిధులు: CBN

AP: SC, ST, BC హాస్టళ్లలో వసతులు మెరుగవ్వాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కేంద్రం నుంచి పావలా వడ్డీ కింద రుణం వస్తుంది. ఆ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా విధానాలను రూపొందించండి. సంక్షేమ హాస్టళ్ల పునర్నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయండి. SC, ST హాస్టళ్లలో చదివే విద్యార్థులు IIT, IIM వంటి సంస్థల్లో సీట్లు సాధించేలా మరింత కృషి చేయాలి’ అని తెలిపారు.