News December 16, 2024

BREAKING: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి FEB 22 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఉంటుంది.

Similar News

News October 19, 2025

గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి: CM

image

TG: గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని సీఎం రేవంత్ విమర్శించారు. HYDలో సర్వేయర్లకు సీఎం లైసెన్సులు అందజేశారు. ‘గత ప్రభుత్వం పోటీ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి. TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది. మేము రాగానే దాన్ని ప్రక్షాళన చేశాం. ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం’ అని తెలిపారు.

News October 19, 2025

JEE మెయిన్-2026 షెడ్యూల్ వచ్చేసింది

image

JEE MAIN-2026 <>షెడ్యూల్‌<<>>ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. సెషన్ 1 దరఖాస్తులను ఈ నెల నుంచి స్వీకరించనున్నట్లు తెలిపింది. 2026 జనవరి 21 నుంచి 30వ తేదీల మధ్య పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. జనవరి నెలాఖరు నుంచి సెషన్-2 అప్లికేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 1-10 మధ్య ఎగ్జామ్ ఉంటుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం JEE MAIN వెబ్‌సైట‌్‌ను సందర్శించండి.

News October 19, 2025

సహజీవనంలో మహిళలకు ఉండే హక్కులేంటి?

image

ప్రస్తుతం మన దేశంలోనూ సహజీవన వ్యవస్థ పెరుగుతోంది. ఇందులో మహిళకు శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులు, ఫోటోలు, వీడియోలు లీక్ అయితే చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఆ జంటకు పుట్టే పిల్లలకు వారసత్వఆస్తిలో హక్కు ఉంటుందని కోర్టు గతంలో స్పష్టంచేసింది. పరస్పర సమ్మతి లేకుండా బంధాన్ని తెంచుకుంటే మెయింటెనెన్స్ అలవెన్స్ పొందే హక్కూ ఉంది. ఈ బంధంలోకి వెళ్లే ముందు మహిళలు ఆర్థికంగా దృఢంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.