News December 16, 2024

వెలిచాల జగపతిరావు పై గ్రూప్-2లో ప్రశ్న

image

జిల్లాకు చెందిన మాజీ MLA, మలిదశ తెలంగాణ ఉద్యమ నేత వెలిచాల జగపతిరావుపై గ్రూప్-2లో ప్రశ్నలు వచ్చాయి. పేపర్-4లో 52వ ప్రశ్నగా ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ శాసన సభ్యుల ఫోరం ఏర్పడిందని ప్రశ్న అడిగారు. తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌తో 1992లో వెలిచాల కన్వీనర్, జానారెడ్డి ఛైర్మన్‌గా తెలంగాణ శాసన సభ్యుల ఫోరాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు చెందిన 92 మంది MLAల సంతకాలు సేకరించి అప్పటి ప్రధాని PVకి వినతిపత్రం ఇచ్చారు.

Similar News

News January 9, 2026

కరీంనగర్: ‘బాలికలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి’

image

కేజీబీవీ విద్యార్థినులను విద్యావంతులుగా మార్చి, అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను కోరారు. ‘నీపా’ (NIEPA) సౌజన్యంతో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, వార్డెన్లకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణలో ఆమె మాట్లాడారు. బాలికలు స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డైరెక్టర్ దేబోర కృపారాణి అధికారులు పాల్గొన్నారు.

News January 9, 2026

KNR: ‘ఉపాధి హామీకి కొత్త రూపం.. ‘వీబీ-జీ రామ్ జీ’గా బలోపేతం’

image

పాత ఎంజీఎన్ఆర్జీఏ చట్టాన్ని నీరుగార్చడం లేదని, దానికి మరిన్ని సంస్కరణలు అద్ది ‘వీబీ-జీ రామ్ జీ’ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్) చట్టంగా కేంద్రం బలోపేతం చేసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరవెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో జరిగిన బీజేపీ జిల్లా కార్యశాలలో ఆయన మాట్లాడుతూ, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.

News January 9, 2026

KNR: స్కూళ్లలో ‘ఫిర్యాదుల పెట్టె’.. వేధింపులకు ఇక చెక్!

image

పాఠశాల విద్యార్థుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేపట్టిన ‘ఫిర్యాదుల పెట్టె’ ఆలోచన ఆదర్శనీయంగా నిలుస్తోంది. బొమ్మకల్ హైస్కూల్‌లో ఈ పెట్టెను ఆమె స్వయంగా పరిశీలించారు. వేధింపులు, సమస్యలు ఎదురైతే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళా పోలీసుల పర్యవేక్షణలో వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. కలెక్టర్ అద్భుతమైన చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.