News December 16, 2024

24న తిరుమల రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు

image

2025 మార్చి నెలకు సంబంధించి శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు TTD ప్రకటించింది. మరిన్ని వివరాలు..
* 21న ఉ.10 గంటలకు ఆర్జితసేవ, మ.3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు
* 23న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉ.11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు
* 23న మ.3 గం.కు వయోవృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లు.
వెబ్‌సైట్: <>ttdevasthanams.ap.gov.in<<>>

Similar News

News July 7, 2025

ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

image

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హోషియార్‌పూర్‌లోని హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడి 8 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు.

News July 7, 2025

ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 11 వరకు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News July 7, 2025

స్థానిక సంస్థలపై ఫోకస్: రామ్‌చందర్ రావు

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తమకు సవాల్ అని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు అన్నారు. బలమైన ప్రతిపక్షం ఉంటే బైఎలక్షన్‌లో అధికార పార్టీ గెలవదని జోస్యం చెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలపై BJP ఫోకస్ చేయలేదని, ఈ సారి వీటిపై ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు. 25 రోజుల్లో పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.