News December 16, 2024
జార్జియాలో 11 మంది భారతీయుల మృతి

జార్జియాలోని గుడౌరిలో ఉన్న ప్రముఖ స్కీ రిసార్టులో విషవాయువులు లీకై 11 మంది భారతీయులు మృతి చెందారు. భారతీయ రెస్టారెంట్ ఉన్న భవనంలోని రెండో అంతస్తులో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. డెడ్‌బాడీలపై ఎటువంటి గాయాలు లేవని తేలింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తర్వాత పవర్ జనరేటర్‌ను ఆన్ చేయడం వల్ల విడుదలైన విషవాయువుల (కార్బన్ మోనాక్సైడ్) కారణంగా మరణాలు సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు.
Similar News
News January 29, 2026
BRS యాక్షన్‌ను బట్టి నా రియాక్షన్ ఉంటుంది: దానం

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణల వేళ స్పీకర్ నోటీసులిచ్చిన నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ‘విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పలేదు. స్పీకర్ నోటీసులకు మా అడ్వకేట్ వివరణ లేఖ రాశారు. అందులో ఏం రాశారో నాకు తెలియదు. స్పీకర్ నుంచి మళ్లీ జవాబు రాలేదు. BRS నన్ను సస్పెండ్ చేయలేదు. ఆ పార్టీ యాక్షన్‌ను బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఎన్నికలకు నేను భయపడను’ అని ఆయన స్పష్టం చేశారు.
News January 29, 2026
యాదాద్రిలో బంగారు, వెండి డాలర్లు మాయం

TG: యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్ల మాయం అంశం కలకలం రేపుతోంది. ప్రచార శాఖలో రూ.10 లక్షల మేర విలువైన కాయిన్స్ మాయమైనట్లు ఆడిట్లో వెల్లడైంది. ఇటీవలే ప్రసాదాల తయారీలో చింతపండు చోరీ కలకలం రేపడం తెలిసిందే.
News January 29, 2026
జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కించిన ‘విశ్వంభర’ సినిమా విడుదలపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ లేదా జులై నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్ మీడియా ఇంటరాక్షన్‌లో చిరంజీవి చెప్పినట్లు సినీవర్గాలు తెలిపాయి. అందులోనూ జులై 10న రావొచ్చని డేట్ కూడా చెప్పేశారట. భారీ ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.


