News December 17, 2024

దుబాయ్‌లో ఉద్యోగాలు.. HYD వాసులకు అవకాశం

image

దుబాయ్‌లో డెలివరీ బాయ్‌ ఉద్యోగం చేసేందుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. HYDలోని ITI మల్లేపల్లి క్యాంపస్‌లో డిసెంబర్ 20న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఓవర్సీస్ మ్యాన్ పవర్ సంస్థ(TOMCOM) వెల్లడించింది. అర్హత: 10వ తరగతి పాస్, కనీసం 3 సంవత్సరాల ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్, 21-40 ఏళ్ల వయసు ఉండాలి.
మరిన్ని వివరాలకు https://tomcom.telangana.gov.in/ సంప్రదించండి.
SHARE IT

Similar News

News January 17, 2025

బీసీ మేధావుల సదస్సులో రాజ్యసభ ఎంపీ

image

కాచిగూడలోని అభినందన్ గ్రాండ్‌లో శుక్రవారం బీసీ మేధావుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. మండలి ప్రతిపక్షనేత సీ.మధుసూదనాచారి, ఆల్ ఇండియా ఓబీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి, బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, అఖిలపక్ష ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, కులసంఘాల సభ్యులు సదస్సులో పాల్గొన్నారు.

News January 17, 2025

HYD: చేవెళ్లలో త్వ‌ర‌లో ఉపఎన్నిక: కేటీఆర్

image

చేవెళ్ల నియోజ‌కవ‌ర్గంలో త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక రాబోతుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసాల‌ను రైతులు, ఆడ‌బిడ్డ‌లు ఎండ‌గట్టాల‌ని కేటీఆర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. చేవెళ్లకు త్వ‌ర‌లో ఉప ఎన్నిక రాబోతోందని KTR వ్యాఖ్యలపై మీరేమంటారు. కామెంట్ చేయండి.

News January 17, 2025

ఇబ్రహీంపట్నం: కూతురు వరసయ్యే బాలికపై అత్యాచారం

image

కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల కథనం.. తుర్కయంజాల్‌కు చెందిన ఆంజనేయులుకు వరుసకు కూతురయ్యే బాలిక పుట్టినరోజు సందర్భంగా కొత్త బట్టలు కొనిస్తానని ఇంట్లో చెప్పి తుర్కయంజాల్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక కేకలు వేస్తూ బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.