News December 17, 2024
బరువు తగ్గాలంటే ఇదే కీలకం!

బరువు తగ్గేందుకు వ్యాయామాలు చేసి, తిండి తగ్గించేసి కష్టపడుతుంటారు చాలామంది. అలా కాకుండా ముందుగా డైట్(ఆహారం)పై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ‘మనం అందించే కేలరీలకంటే ఖర్చయ్యే కేలరీలు ఎక్కువ ఉండాలి. అలా అయితేనే ఒంట్లోని కొవ్వును శరీరం వాడుకుంటుంది. దీంతో బరువు తగ్గుతారట. వెయిట్ లాస్‌లో 60% పాత్ర సరైన ఆహారం తీసుకోవడంపైనే ఉంటుంది. వ్యాయామం పాత్ర 40శాతమే’ అని పేర్కొంటున్నారు.
Similar News
News November 4, 2025
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలకు ప్రభుత్వం కమిటీని నియమించింది. స్పెషల్ సీఎస్ ఛైర్మన్‌గా, ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ ఛైర్మన్‌గా 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాలేజీ యాజమాన్యాల నుంచి ముగ్గురికి, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌కు చోటు కల్పించింది. రీయింబర్స్‌మెంట్ విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనుంది.
News November 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 4, 2025
వరల్డ్‌కప్ విజేతలు విక్టరీ పరేడ్‌కు దూరం

ICC ఉమెన్స్ వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విక్టరీ పరేడ్‌కు దూరం కానుంది. ఈ మేరకు BCCI ప్రకటించింది. ఈ ఏడాది IPL కప్ విజేత RCB చేపట్టిన పరేడ్‌లో తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ర్యాలీ చేపట్టడం లేదని చెబుతున్నారు. రేపు ఢిల్లీలో PM చేతుల మీదుగా టీమ్ ఇండియాను సన్మానిస్తారు. తొలిసారి ఉమెన్ వరల్డ్‌కప్ గెలిచినా పరేడ్ లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి.


