News December 17, 2024
నెల్లూరు: ‘త్వరలోనే 108 ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం’

108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతామని మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ తెలిపారు.108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధి వర్గం రాష్ట్ర అధ్యక్షుడు బల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రిని కలిశారు. 108 ఉద్యోగుల ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
Similar News
News November 11, 2025
నెల్లూరు కలెక్టరేట్‌లో మౌలానాకు నివాళి

నెల్లూరు కలెక్టరేట్‌లో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవం జరిగింది. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ హిమాన్షు శుక్లా నివాళి అర్పించారు. దేశంలో విద్యావ్యవస్థకు సంస్కరణలతో అబుల్ కలామ్ బాటలు వేశారని తెలిపారు.
News November 11, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. సచివాలయ ఉద్యోగి మృతి

నెల్లూరు NTR నగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి ముజాహిద్దీన్ అలీ మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈయన ద్వారకా నగర్-2 వార్డు సచివాలయంలో శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. బైక్‌పై వస్తుండగా లారీ ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు.
News November 11, 2025
కావలి: వృద్ధురాలిపై అఘాయిత్యానికి యత్నం

వృద్ధురాలిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించిన ఘటన కావలి మండలంలో జరిగింది. కావలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మనోజ్ ప్రభాకర్ వృద్ధురాలి(75) ఇంట్లోకి వెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి అతడు పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.


