News December 17, 2024

భారీగా తగ్గిన అంబానీ, అదానీ సంపద

image

ఇండియన్ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి డ్రాప్ అయినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అంబానీ వ్యక్తిగత సంపద గత జులైలో $120.8B కాగా, ఈనెల 13 నాటికి $96.7Bకు తగ్గిందని తెలిపింది. మరోవైపు అదానీ సంపద $122.3B నుంచి $82.1Bకు దిగి వచ్చినట్లు పేర్కొంది. శివ్ నాడార్ సంపద $10.8B, సావిత్రి జిందాల్ సంపద $10.1B పెరిగినట్లు వెల్లడించింది.

Similar News

News November 6, 2025

బయోమాస్‌తో రైతులకు ఆదాయం, ఉపాధి: సారస్వత్

image

AP: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయోమాస్ ఎంతో ఉపయుక్తమని AP గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ సారస్వత్ పేర్కొన్నారు. బయోమాస్‌లో ఏపీ నం.1గా ఉందన్నారు. రైతులకు ఆదాయంతో పాటు ఉపాధి మెరుగుపడుతుందని బోర్డు భేటీలో చెప్పారు. విశాఖ(D) పూడిమడక వద్ద ₹1.85 L కోట్లతో NGEL హైడ్రోజన్ హబ్‌ను నెలకొల్పుతోందని CS విజయానంద్ తెలిపారు. రోజుకు 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారని చెప్పారు.

News November 6, 2025

జుట్టుకు రంగు వేస్తున్నారా?.. జాగ్రత్త!

image

పదేపదే హెయిర్ డై లేదా కలరింగ్ చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని ముంబై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అభిషేక్ పిలానీ హెచ్చరించారు. ‘తరచుగా రంగులు వేయడం వల్ల జుట్టులోని కెరాటిన్ దెబ్బతిని పెళుసుగా మారడం, చివర్లు చిట్లడం జరుగుతుంది. అమోనియా, పెరాక్సైడ్ వంటి తీవ్రమైన రసాయనాలు జుట్టుకు శాశ్వత నష్టం కలిగిస్తాయి. జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు తీవ్రమవుతాయి’ అని పేర్కొన్నారు.

News November 6, 2025

బీఆర్ఎస్ ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: రేవంత్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవబోతున్నామని మంత్రులతో మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బైపోల్‌పై ఆయన వారితో సమీక్ష నిర్వహించారు. మిగిలిన 3 రోజుల్లో ప్రచారంలో దూకుడు పెంచాలని సూచించారు. సోషల్ మీడియాలో రోజుకో ఫేక్ సర్వే వదులుతూ ప్రజలు, ఓటర్లను బీఆర్ఎస్ గందరగోళానికి గురి చేస్తోందని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలన్నారు.