News December 17, 2024
సిరికొండ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రైతు బిడ్డ

సిరికొండ మండల కేంద్రానికి చెందిన కస్బె రామారావు కుమారుడు కస్బె సాయికుమార్ ఇటీవల విడుదలైన సీఆర్పీఎఫ్ ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. తల్లి తండ్రులు వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తారు. సిరికొండ మండల కేంద్రంలోనే ఎస్సీ సామాజిక వర్గంలో మొట్ట మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అరుదైన ఘనత రామారావు తెలిపారు. ఈ సందర్భంగా కస్బె సాయికుమార్ ను స్నేహితులు, కుటుంబీకులు, గ్రామస్తులు అభినందించారు.
Similar News
News January 14, 2026
ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News January 13, 2026
ఆదిలాబాద్: రూ.90 పెరిగిన పత్తి ధర

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,710గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.90 పెరిగినట్లు వెల్లడించారు.
News January 12, 2026
ADB: రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా జమునా నాయక్

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని దానోరా (బి) సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. క్రమశిక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పాటు చేస్తానని జమునా నాయక్ పేర్కొన్నారు.


