News December 17, 2024

ఒకవేళ మూడో టెస్ట్ డ్రా అయితే?

image

AUSతో జరుగుతోన్న మూడో టెస్ట్ డ్రాగా ముగిసినా టీమ్ ఇండియా WTC ఫైనల్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే తర్వాత జరగబోయే మిగతా రెండు టెస్టుల్లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో IND 57.29 PCTతో మూడో స్థానంలో ఉంది. టాప్-2లో SA (63.33), AUS (60.71) ఉన్నాయి. మూడో టెస్ట్ డ్రా అయి, మిగతా 2 టెస్టులు గెలిస్తే భారత జట్టు PCT ఆసీస్ కంటే మెరుగవుతుంది.

Similar News

News December 31, 2025

తలరాతను మార్చిన చదువు.. తల్లిదండ్రులకు అద్భుత బహుమతి

image

మహారాష్ట్రలో గొర్రెల కాపర్ల కుటుంబంలో పుట్టి IPS ఆఫీసర్ అయిన బర్దేవ్ సిద్ధప్ప గుర్తున్నారా? ఇల్లు కూడా లేని ఆయన బీటెక్ పూర్తి చేసి 2024లో యూపీఎస్సీ ఫలితాల్లో IPSగా ఎంపికయ్యారు. ఆ కమ్యూనిటీ నుంచి IPS అయిన తొలి వ్యక్తిగా రికార్డు అందుకున్నారు. తాజాగా తన తల్లిదండ్రులను, ఆత్మీయులను విమానం ఎక్కించారు. విమానం గురించి చిన్నప్పుడు కలలు కనేవాడినని, ఇప్పుడు నిజమైందని సిద్ధప్ప ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

News December 31, 2025

వారెన్ బఫెట్ వీడ్కోలు: వ్యాపార దిగ్గజాలు నేర్చుకున్న పాఠాలివే!

image

బెర్క్‌షైర్ హాత్‌వే CEOగా వారెన్ బఫెట్ తన సుదీర్ఘ ప్రస్థానాన్ని నేటితో ముగించనున్నారు. 95 ఏళ్ల వయసున్న ఈ పెట్టుబడి దిగ్గజం నుంచి నేర్చుకున్న పాఠాలను వ్యాపారవేత్తలు గుర్తుచేసుకుంటున్నారు. క్లిష్టమైన విషయాలను సరళంగా చెప్పడం, ఓపికతో లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్ చేయడం బఫెట్ ప్రత్యేకత. డబ్బు కంటే నైతికతకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. సంపద మనిషిని బందీ చేయకూడదని నమ్మి.. తన ఆస్తిని దానధర్మాలకు కేటాయించారు.

News December 31, 2025

APPLY NOW: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 18 పోస్టులు

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<>HAL<<>>) నాసిక్‌లో 18 ఎక్స్ సర్వీస్‌మెన్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిప్లొమా, ఇంటర్ అర్హత కలిగి, ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో పని చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. జనవరి 11న రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in