News December 17, 2024

ఏపీలో పేపర్ లీక్ కలకలం

image

ఏపీలో పదో తరగతి గణితం ప్రశ్న పత్రం యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో లీకవడం కలకలం రేపింది. దీంతో 6-10 తరగతుల విద్యార్థులకు నిన్న జరగాల్సిన సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 మ్యాథ్స్ పరీక్షను ఈనెల 20కి పాఠశాల విద్యాశాఖ వాయిదా వేసింది. మిగతా పేపర్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. పేపర్ లీక్‌పై అధికారులు ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Similar News

News December 30, 2025

డైలీ 4వేల అడుగులు వేస్తే మరణ ముప్పు తగ్గినట్లే: అధ్యయనం

image

యువకుల్లా వృద్ధులూ రోజూ 10 వేల అడుగులు నడవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 72 ఏళ్ల వృద్ధ మహిళలపై 11 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలో.. వారానికి కేవలం 1-2 రోజులు 4,000 అడుగులు నడిచినా గుండె జబ్బులు, మరణాల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తేలింది. మెట్లు ఎక్కడం, భోజనం తర్వాత నడక వంటి చిన్న చిన్న మార్పులతో ఈ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. SHARE IT

News December 30, 2025

రేపు బయటికి రావద్దు!

image

ఇందుకు 2 కారణాలున్నాయి. ఒకటి తెలుగు రాష్ట్రాల్లో రేపు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉదయం, రాత్రివేళల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పింది. ఇక 31st కావడంతో పార్టీలు చేసుకునేవారూ ఇళ్లలోనే ఉండటం బెటర్. రేపు HYDతో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో పోలీసులు పెద్దఎత్తున డ్రంకెన్ డ్రైవ్ చేపట్టనున్నారు. మద్యం సేవించినవారు వాహనాలపై బయటికి రావద్దని సూచిస్తున్నారు.

News December 30, 2025

పడిపోయిన ద్రవ్యోల్బణం.. ఇరాన్‌లో ఆందోళనలు

image

ఇరాన్‌ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ కరెన్సీ దారుణంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 1.38 మిలియన్లకు దిగజారిపోయింది. అణు ఆంక్షల వల్ల ఇరాన్‌ పరిస్థితి అతలాకుతలం అయ్యింది. కరెన్సీ పడిపోవడంతో ద్రవ్యోల్బణం 42.2%కి చేరింది. ఆహార పదార్థాల ధరలు 72% పెరిగాయి. దీంతో టెహ్రాన్‌, ఇస్ఫహాన్, షిరాజ్, మష్హద్‌ సిటీల్లో జనం నిరసనబాట పట్టారు. సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మహ్మద్ రెజా రాజీనామా చేశారు.