News December 17, 2024

గ్రూప్-2లో మన పాలమూరుపై ప్రశ్నలు

image

TGPSC నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో పాలమూరు జిల్లాపై ప్రశ్నలు వచ్చాయి. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సభ్యులు, గంగాపూర్, మన్యంకొండ, పిల్లలమర్రి దేవాలయాలు, సురవరం ప్రతాపరెడ్డి, రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి, గోరేటి వెంకన్న, కిన్నెర మొగులయ్య, నాగం జనార్దన్ రెడ్డి స్థాపించిన తెలంగాణ నగారా సమితిపై పలు ప్రశ్నలు వచ్చాయి. తమ ప్రాంతం నుంచి ప్రశ్నలు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 18, 2026

జడ్చర్ల: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరం: లక్ష్మారెడ్డి

image

మాజీ మంత్రులు హరీశ్ రావు, KTRలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలను మారీచుడు, సుబాహుడు అని సంబోధించడం, “నడుం విరగ్గొడతా” అని మాట్లాడటం నీచమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు వచ్చాయని, ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లతో ప్రాజెక్టులు నిర్మించామని గుర్తుచేశారు. తాము ఎన్నడూ అభివృద్ధికి అడ్డుపడలేదని స్పష్టం చేశారు.

News January 18, 2026

MBNR: రేపే ఆఖరి తేదీ దరఖాస్తు చేసుకోండి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తోంది. రేపటి (19)వరకు సీసీటీవీ కెమెరా శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పించనున్నారు. 19 నుంచి 45 సం. వయస్సు గల పురుషులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బండమీదిపల్లిలోని RSETY కేంద్రంలో లేదా 9963369361, 9542430607 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

News January 17, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం
✒MBNR: CM ఇలాకా.. BRSలో భారీగా చేరికలు
✒పాలమూరు జిల్లా అభివృద్ధి సీఎం బాధ్యత: డీకే అరుణ
✒వనపర్తి:భార్య చేతిలో భర్త దారుణ హత్య
✒రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం
✒సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన.. జర్నలిస్టులు ముందస్తు అరెస్ట్
✒పాలమూరులో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం:CM రేవంత్ రెడ్డి