News December 17, 2024
జమిలి బిల్లుపై BJP వ్యూహం: ఓటింగ్ or జేపీసీ?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734402491278_1199-normal-WIFI.webp)
‘జమిలి బిల్లు’ను లోక్‌సభలో ప్రవేశపెట్టడంలో ప్రభుత్వ వ్యూహంపై ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ విప్‌లు జారీచేయడంతో చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుందేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంఖ్యా బలం, రాష్ట్ర అసెంబ్లీల మద్దతు అవసరం కావడంతో ప్రభుత్వం JPCకి పంపొచ్చని కొందరి అంచనా. అసలు బిల్లును ఎలా డ్రాఫ్ట్ చేశారో, ఏయే అంశాలను చేర్చారో తెలిస్తేనే క్లారిటీ వస్తుందని మరికొందరి వాదన. మీరేమంటారు?
Similar News
News February 5, 2025
Breaking: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738675683357_1032-normal-WIFI.webp)
ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. కులగణన ఫామ్‌కు నిప్పుపెట్టడంపై వివరణ కోరుతూ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కులగణనను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అలాంటిది ఆ ఫామ్‌కు నిప్పుపెట్టడంతో మంత్రి సీతక్క సహా పలువురు నేతలు ఆయన్ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.
News February 5, 2025
తొలిసారి Girl Friend గురించి చెప్పిన బిల్‌గేట్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738741990854_1199-normal-WIFI.webp)
తనకు సరైన ప్రేయసి దొరికిందని, ఆమెతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ అన్నారు. తామిద్దరం కలిసి ఒలింపిక్స్, అనంత్ అంబానీ పెళ్లి సహా ప్రపంచమంతా చుట్టేస్తున్నామని తెలిపారు. చాలా సరదాగా గడుపుతున్నామని వెల్లడించారు. ఒరాకిల్ మాజీ CEO మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డే ఆయన ప్రేయసి. 2019లో భర్త చనిపోయాక ఆయన వద్దకు చేరారు. కొన్ని కారణాలతో గేట్స్‌తో మిలిండా విడాకులు తీసుకోవడం తెలిసిందే.
News February 5, 2025
వివేకా హత్య కేసులో కీలక పరిణామం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738745914982_782-normal-WIFI.webp)
AP: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. 2023లో తనను ఇబ్బంది పెట్టారని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు DSPగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల మాజీ CI ఈశ్వరయ్య, కడప జైలు మాజీ సూపరింటెండెంట్ ప్రకాశ్‌పై కేసులు నమోదయ్యాయి.