News December 17, 2024

రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు: మంత్రి కోమటిరెడ్డి

image

TG: జనగణన తర్వాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీంతో రాష్ట్రంలో 34 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ రావు హుందాగా ప్రవర్తించడం లేదని దుయ్యబట్టారు. తిరిగి అధికారంలోకి వస్తామని నమ్మకం లేకనే కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శించారు.

Similar News

News January 11, 2026

నితీశ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

image

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్‌లు ఈ మేరకు బహిరంగంగా మద్దతు తెలిపారు. రెండు దశాబ్దాలుగా బిహార్ అభివృద్ధికి నితీశ్ చేసిన కృషి ఆయనను భారతరత్నకు అర్హుడిని చేస్తుందని వారు పేర్కొన్నారు. ఇదే సమయంలో జేడీయూ నేత కేసీ త్యాగి సైతం ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

News January 11, 2026

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ అలర్ట్‌

image

ఈ-కామర్స్ సంస్థలు మరో భారీ సేల్స్‌కు రెడీ అయ్యాయి. అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ను జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో SBI క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10% వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ తన రిపబ్లిక్ డే సేల్‌ను జనవరి 17 నుంచి ప్రారంభించనుంది. ప్లస్, బ్లాక్ మెంబర్లకు ముందస్తు యాక్సెస్ ఉంటుంది. ఫోన్లు, TVలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లను ఇస్తున్నాయి.

News January 11, 2026

జనవరి 11: చరిత్రలో ఈరోజు

image

* 1922: మధుమేహ బాధితులకు ఇన్సులిన్‌ అందుబాటులోకి వచ్చిన రోజు * 1944: జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సోరెన్ జననం * 1966: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం * 1973: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు (ఫొటోలో) * 2008: పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం