News December 17, 2024
ALERT.. భారీ వర్షాలు

AP: ద.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, NLR, TRPT జిల్లాల్లో, ఈనెల 19న విశాఖ, VJA, 20న శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి రానున్న 2 రోజుల్లో తమిళనాడు తీరం దిశగా రానుందని అంచనా వేసింది.
Similar News
News October 30, 2025
LIC AAO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

ఎల్ఐసీలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AAO)- జనరలిస్ట్ పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన వారి జాబితా <
News October 30, 2025
మార్గదర్శి కేసులో ఉండవల్లి ప్రతివాదే కాదు: AP ప్రభుత్వం

మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును సుప్రీం విచారించింది. మాజీ MP ఉండవల్లి అరుణ్‌కుమార్ వర్చువల్‌గా వాదనలు వినిపిస్తూ సంస్థ RBI నిబంధనల ఉల్లంఘనపై విచారించాలన్నారు. అయితే ప్రధాన పిటిషన్‌పై విచారణలో వాటిని హైకోర్టుకు చెప్పాలని SC సూచించింది. ₹2300 CR డిపాజిట్లలో చాలా వరకు చెల్లించామని సంస్థ తరఫున సిద్ధార్థ్ లూథ్రా పేర్కొన్నారు. అటు కేసులో ఉండవల్లి ప్రతివాదే కాదని AP ప్రభుత్వ న్యాయవాది SCకి తెలిపారు.
News October 30, 2025
ఇంజినీరింగ్ అర్హతతో 30 పోస్టులు

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NEEPCO) 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు GATE-2025 అర్హత సాధించిన అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గేట్ స్కోరు , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://neepco.co.in


