News December 17, 2024
హేజిల్‌వుడ్‌కు గాయం
బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ స్టార్ బౌలర్ హేజిల్‌వుడ్ గాయపడ్డారు. కాలు పిక్కలు పట్టేయడంతో ఆయన ఫీల్డ్‌ను వదిలివెళ్లారు. అనంతరం హేజిల్‌వుడ్‌ను స్కానింగ్ కోసం తీసుకెళ్లినట్లు CA తెలిపింది. కాగా నిన్న అద్భుతమైన బంతితో అతడు కోహ్లీ వికెట్ పడగొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ను త్వరగా ఆలౌట్ చేసి ఫాలో ఆన్ ఆడించేందుకు ఆసీస్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం IND స్కోర్ 180/6గా ఉంది.
Similar News
News February 5, 2025
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్?
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. BCCI వర్గాల సమాచారం ప్రకారం.. భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వాలని బోర్డు ఇప్పటికే రోహిత్‌కు సూచించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం రోహిత్ తన రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆధారంగా కొత్త సారథిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.
News February 5, 2025
WORLD RECORD: ఒంగోలు జాతి ఆవు ధర రూ.41 కోట్లు
సాధారణంగా ఆవు ధర వేలల్లో, కాస్త పాలు ఎక్కువగా ఇచ్చే రకమైతే రూ.1-2 లక్షలు ఉంటుంది. అయితే ఒంగోలు/నెల్లూరు బ్రీడ్‌కు చెందిన వయాటినా-19 అనే ఆవు జ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడైంది. దీంతో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేకయ్యాయి. కాగా 1800sలో ఒంగోలు ఆవును బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అనేక జెనెటిక్ మార్పులతో ప్రాచుర్యం పొందింది. వయాటినా-19 బరువు ఏకంగా 1,101kgలు.
News February 5, 2025
చికెన్ తినడానికి భయపడుతున్నారా?
APలోని కొన్నిచోట్ల కోళ్లు చనిపోతున్న <<15366175>>ఘటనలపై <<>>పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనలతో కోళ్లు, గుడ్లు తినేందుకు ప్రజలు సంకోచిస్తుండటంతో వీటి వినియోగం వల్ల అనారోగ్యం సంభవించినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ప్రజలు అపోహలకు గురికావొద్దని, ఉడికించిన గుడ్లు, చికెన్ తీసుకోవచ్చని సూచించారు. కొల్లేరు సరస్సుకు ఈ ఏడాది వలస పక్షులు అధికంగా రావడం కూడా ఆ సమీపంలో కోళ్ల మృతికి కారణంగా భావిస్తున్నారు.