News December 17, 2024
కులగణన డేటా ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు!

TG: సంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ప్రకటించారు. అర్హుల ఎంపికకు ఇటీవల నిర్వహించిన కులగణన డేటాను పరిశీలిస్తామని చెప్పారు. కొత్తగా 10 లక్షల కార్డులు ఇస్తామని చెప్పిన ఆయన, వీటి వల్ల 36 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి చేసుకున్న 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి తెలిపారు.
Similar News
News September 19, 2025
ఈనెల 22న ‘కాంతార-1’ ట్రైలర్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార-1’ సినిమా ట్రైలర్ విడుదలపై అప్డేట్ వచ్చింది. ఈనెల 22న మధ్యాహ్నం 12.45 గంటలకు ట్రైలర్ రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
News September 19, 2025
మొక్కజొన్నలో పాము పొడ తెగులును ఎలా గుర్తించాలి?

పాము పొడ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కజొన్న మొక్కల కింది ఆకులపై సోకుతుంది. తర్వాత పై ఆకులకు, కాండానికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కల ఆకులు, కాండంపై బూడిద, గోధుమ వర్ణపు మచ్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి.. చూడటానికి పాముపొడ వలే కనిపిస్తాయి. కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వల్ల కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. దీని వల్ల మొక్కల సంఖ్య తగ్గి పంట దిగుబడి పడిపోతుంది.
News September 19, 2025
మొక్కజొన్నలో పాము పొడ తెగులు నివారణ ఎలా?

మొక్కజొన్నలో పాముపొడ తెగులు నివారణకు నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఆకులను తొలగించి నాశనం చేయాలి. తర్వాత 200 గ్రా. కార్బెండజిమ్ (లేదా) 200 మి.లీ. ప్రోపికొనజోల్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఏటా ఈ తెగులు ఆశించే ప్రాంతాల్లో పంట విత్తిన 40 రోజుల తర్వాత తెగులు సోకకముందే ఈ మందులను పిచికారీ చేసుకోవాలని.. పంట చుట్టూ కలుపు మొక్కలను తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.