News December 17, 2024
అసెంబ్లీలో భట్టి వర్సెస్ హరీశ్

TG: బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అసెంబ్లీలో హరీశ్ రావు విమర్శలు చేశారు. దీనిపై చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే తాము అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు బయటపెట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. అప్పులపై చర్చకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దీంతో సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.
Similar News
News October 18, 2025
‘డ్యూడ్’, ‘తెలుసు కదా’ చిత్రాల కలెక్షన్స్ ఇలా!

* ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ మూవీకి తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రానికి రూ.10 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
* సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ సినిమాకు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఇండియాలో రూ.2 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
* వీటిలో ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి.
News October 18, 2025
వంటింటి చిట్కాలు

* కిస్‌మిస్‌లు నిల్వ చేసే ముందు రెండు స్పూన్ల బియ్యప్పిండిని వాటికి పట్టిస్తే ఎన్ని రోజులైనా అతుక్కోకుండా ఉంటాయి.
* నూనె డబ్బాలు ఎంత తోమినా జిడ్డుగానే ఉంటాయి. అప్పుడు కాస్త క్రిస్టల్ సాల్ట్, డిష్ వాష్ లిక్విడ్ వేసిన నీటిలో డబ్బాను కాసేపు నానబెట్టి స్క్రబ్బర్‌తో రుద్దాలి. దీంతో జిడ్డంతాపోయి తళతళా మెరుస్తాయి.
* చేపలు శుభ్రం చేసిన తర్వాత శెనగపిండి పట్టించి 5 నిమిషాల తర్వాత కడిగితే నీచు వాసన పోతుంది.
News October 18, 2025
బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.