News December 17, 2024
విశాఖ మెట్రో రూట్‌లపై మీ కామెంట్

విశాఖలో మెట్రో ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే <<14776969>> కారిడార్ -1<<>>, <<14777184>>కారిడార్-2<<>>, <<14777236>>కారిడార్-3<<>> కింద రూట్‌మ్యాప్ రెడీ చేశారు. దీనిపై అసెంబ్లీలోనూ విశాఖ MLAలు తమ అభిప్రాయాలు తెలిపారు. మరికొన్ని ప్రాంతాలు కలపాలని సూచించారు. SMలోనూ మెట్రో రూట్‌లపై చర్చ నడుస్తోంది. మరి ఇంకా ఏయే ప్రాంతాలకు మెట్రో ఎటాచ్ అయితే మరింత ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News January 17, 2026
విశాఖలో రెండు ట్రావెల్ బస్సులు సీజ్

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు శనివారం విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 2 ట్రావెల్ బస్సులను సీజ్ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన మరో 5 బస్సులపై కేసుల నమోదు చేసి రూ.60,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 17, 2026
కేజీహెచ్‌లో రోగులతో మాట్లాడిన కలెక్టర్

కేజీహెచ్‌లోని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వార్డులో పర్యటించారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడగా రోగి సిబ్బందికి డబ్బులు ఇచ్చినట్లుగా చెప్పడంతో విచారణకు ఆదేశించారు. అక్కడే ఉన్న సూపర్డెంట్ ఈ విషయంపై విచారణ చేయాలని వైద్యం కోసం ఏ ఒక్కరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్నిచోట్ల ఉచితంగా వైద్య సేవలు అనే బోర్డులు పెట్టాలని సూచించారు
News January 17, 2026
KGHలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్

KGHలో వైద్యం కోసం వచ్చే రోగులను ఎవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. శనివారం KGHలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ట్రీట్‌మెంట్‌కు డబ్బులు అడిగినట్టు రోగి బంధువులు తనకు తెలిపారని, ఈ విషయంపై విచారణ చేపట్టాలని సూపరిండెంటెంట్‌ను ఆదేశించారు.


