News December 17, 2024

పేర్ని నానిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి కొల్లు

image

AP: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబమంతా పరారీలో ఉందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పేదల బియ్యం బొక్కేసి నాని నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. YCP అంటేనే దొంగల పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్‌లో 1,320 టన్నుల PDS బియ్యం ఉన్నాయని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ బియ్యాన్ని షిప్ నుంచి అన్‌లోడ్ చేయించి సీజ్ చేస్తామన్నారు.

Similar News

News January 16, 2026

మరియా గొప్ప మహిళ: ట్రంప్

image

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మరియాతో భేటీ కావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. చాలా కష్టాలను ఎదుర్కొన్న ఆమె గొప్ప మహిళ అని కొనియాడారు. తాను చేసిన కృషిని గౌరవిస్తూ నోబెల్ శాంతి బహుమతి అందజేసినట్లు పేర్కొన్నారు. పరస్పర గౌరవానికి ఇదో గొప్ప సూచిక అని చెప్పారు. ఈ సంద్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

News January 16, 2026

క్షణాల్లో మెరిసే అందం మీ సొంతం

image

ఏదైనా ఫంక్షన్లు, పెళ్లిల్లు, పార్టీలు ఉంటే అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వాడితే ఇన్‌స్టంట్ గ్లో వస్తుందంటున్నారు నిపుణులు. * బాగా పండిన అరటిపండు, తేనె, శనగపిండి, కాఫీ పౌడర్ కలిపి చర్మానికి అప్లై చేసి, 10నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. -ఓట్స్‌ గంటపాటు నానబెట్టి తేనె కలిపి పేస్ట్ చేసి దాన్ని చర్మానికి అప్లై చేసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

News January 16, 2026

కనుమ రోజున పశువులను ఎలా పూజించాలి?

image

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే రైతుకి ఉత్సాహం. పంట చేతికి రావడంలో వాటి పాత్ర కీలకం. తమకు సుఖ,సంతోషాలను అందించడానికి అహర్నిశలు కష్టపడే పశువులను రైతులు మరచిపోరు. తమకు జీవనాధారమైన మూగజీవాల పట్ల కృతజ్ఞతగా అన్నదాతలు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. ఈ రోజు పశువులను ఎలా పూజిస్తే వ్యవసాయం మరింత సుభిక్షంగా ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ <<>>క్లిక్ చేయండి.