News December 17, 2024

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

image

TG: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రపతికి సీఎం రేవంత్, గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ, మంత్రులు స్వాగతం పలికారు. ఈ నెల 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. 20న ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా ఇవాళ ఉదయం ద్రౌపదీ ముర్ము ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే.

Similar News

News February 10, 2026

AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

హైదరాబాద్‌లోని AIIMS బీబీనగర్ 26 Jr. రెసిడెంట్, Sr. రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG, సంబంధిత విభాగంలో MD, DNB, DM, MS, MCh అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ రెసిడెంట్ పోస్టులను అకడమిక్ మెరిట్ ఆధారంగా, సీనియర్ రెసిడెంట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in

News February 10, 2026

కృతజ్ఞత లేని వారికి మళ్లీ సాయం చేయొద్దు: పరుచూరి

image

ఇతరులు చేసిన మంచిని, సాయాన్ని ఇట్టే మర్చిపోయే రోజులివి. అలాంటి వారిని ఉద్దేశించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. మంచితనంతో చేసిన సాయాన్ని మర్చిపోయే వారికి మరోసారి మేలు చేయడం తప్పని అభిప్రాయపడ్డారు. ఇది అర్హత లేని వారికి దానం చేయడం కిందకే వస్తుందని రాసుకొచ్చారు. కృతజ్ఞత లేని వారికి పొరపాటున కూడా మళ్లీ సాయం చేసి తప్పు చేయవద్దని ఆయన సూచించారు.

News February 10, 2026

HYD ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 50% HRA ఎగ్జెంప్షన్!

image

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం పాత పన్ను పద్ధతిలో ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పుడు కేవలం ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే పరిమితమైన 50% HRA ఎగ్జెంప్షన్ ఇకపై హైదరాబాద్‌, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్‌కూ వర్తించనుందని సమాచారం. అంటే కట్టే రెంట్‌లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.