News December 17, 2024
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు

APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు. దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా అందనున్నాయి.
Similar News
News October 29, 2025
‘బ్రేకప్ అయింది సర్.. లీవ్ కావాలి’

లీవ్ కోసం ఓ ఉద్యోగి తన బాస్‌కు పంపిన రిక్వెస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇటీవలే నాకు బ్రేకప్ అయింది. పనిపై దృష్టి పెట్టలేకపోతున్నా. నాకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 8 వరకు సెలవు కావాలి’ అని ఎంప్లాయ్ పెట్టిన మెయిల్‌ను ‘Knot Dating’ సంస్థ CEO జస్వీర్ సింగ్ షేర్ చేశారు. అత్యంత నిజాయతీగా అడగడంతో వెంటనే లీవ్ ఇచ్చానని పేర్కొన్నారు. దీనికి లైకులు, కామెంట్లు పోటెత్తుతున్నాయి.
News October 29, 2025
ఏపీలో ఆ జిల్లాల్లో సెలవులు.. కాకినాడలో రద్దు

తుఫాను క్రమంగా బలహీనపడటంతో ఏపీలోని కాకినాడ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు రద్దు చేశారు. ఈ నెల 31వరకు సెలవులు ఇవ్వగా పరిస్థితి అదుపులోకి రావడంతో విద్యార్థులు రేపటి నుంచే స్కూళ్లు, కాలేజీలకు రావాలని అధికారులు ఆదేశించారు. అటు విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో యథాతథంగా స్కూళ్లు, కాలేజీలు ఉంటాయని స్పష్టం చేశారు.
News October 29, 2025
వైఫల్యాలు విజయాలకు మెట్లు!

మీరు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని బాధపడుతున్నారా? విజయం పొందలేమని ఆందోళన చెందుతున్నారా? మీలానే సర్ జేమ్స్ డైసన్ అనుకుని తన ప్రయత్నాలను ఆపితే బ్యాగ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్ రూపొందేదా? ఆయన ఏకంగా 5,126 సార్లు విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన స్థాపించిన డైసన్ లిమిటెడ్ కంపెనీ వార్షికాదాయం ₹75,300 కోట్లు. వైఫల్యం అనేది ఆగిపోవడానికి సంకేతం కాదు.. ఇది విజయానికి మెట్టు అని గుర్తుంచుకోండి.


