News December 17, 2024

భీమవరం: పోలీసులపై దాడి చేసిన నిందితులు అరెస్టు

image

పోలీసులపై దాడి చేసిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ రమేశ్ బాబు కథనం మేరకు.. రాజమండ్రిలో శ్రీకాకుళం పోలీసులపై దాడి చేసి.. రాపాక ప్రభాకర్‌‌ను తీసుకువెళ్లిన నిందితులను అరెస్టు చేశామన్నారు. దాడి చేసిన వారిలో భీమవరానికి చెందిన శ్రీకాంత్, వినోద్, రాజు, మహంకాళి, క్రాంతి, మొగల్తూరుకి చెందిన కామరాజుతో పాటు రాజమండ్రికి చెందిన మరో ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Similar News

News December 18, 2024

నల్లజర్లలో మహిళను చీరతో కట్టేసి దొంగతనం

image

నల్లజర్లలోని దూబచర్లలోని రిటైర్డ్ అగ్రికల్చరల్ ఆఫీసర్ కృష్ణమూర్తి నివాసంలో తెల్లవారుజామున నిద్రలో ఉండగా ముగ్గురు ఆగంతకులు మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని హెల్పర్, యజమానిని చీరతో కట్టేసి, మంచంపై కదల్లేని స్థితిలో ఉన్న మహిళ ఒంటిపై నగలు, బీరువాలో సొమ్ము దోచుకెళ్లారు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టామన్నారు.

News December 18, 2024

వరదరాజపురం వద్ద షాపులోకి దూసుకెళ్లిన వ్యాను

image

గణపవరం మండలం వరదరాజపురం వద్ద బుధవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. తాడేపల్లిగూడెం నుంచి గణపవరం వస్తున్న వ్యాను వరదరాజపురం వద్ద చికెన్ షాపులోకి  దూసుకెళ్లింది. ఘటనలో రెండు టూ వీలర్లు నుజ్జు నుజ్జు అయినట్లు తెలుస్తోంది. కాగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 18, 2024

నేడు టీడీపీలోకి ఆళ్ల నాని

image

ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తొలుత ఆయన రాకను ఏలూరు నేతలంతా వ్యతిరేకించారు. అయితే అధిష్ఠానం చొరవతో నేతలంతా సర్దుమణిగారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని ఏలూరు MLA బడేటి చంటి సైతం స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే ఏలూరులోని వైసీపీ సీనియర్ నేతలంతా టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆళ్లనాని చేరిక అక్కడి రాజకీయాల్లో పెద్ద మలుపు అని విశ్లేషకులు అంటున్నారు.