News December 17, 2024

చిత్తూరు: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భారీ జరిమానా

image

చిత్తూరు నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 11 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.1.10 లక్షలు జరిమానా జడ్జి ఉమాదేవి విధించినట్లు తెలిపారు. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జరుగు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

Similar News

News December 22, 2024

చిత్తూరు: నేటి నుంచి టీచర్లకు కౌన్సెలింగ్

image

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేస్తున్న పలు కేడర్ టీచర్లకు నేడు, రేపు (ఆది, సోమవారం) ప్రమోషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు HMగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నట్లు తెలిపారు. సీనియార్టీ జాబితాను ఇప్పటికే ఎంఈఓలకు పంపామన్నారు.

News December 21, 2024

బైరెడ్డిపల్లి: డెంగ్యూతో విద్యార్థిని మృతి

image

బైరెడ్డిపల్లి మండలం ఓటేరిపాలెం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని డెంగ్యూ జ్వరంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుణశేఖర్ కుమార్తె రక్షిత 6వ తరగతి చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.

News December 21, 2024

జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పెద్దిరెడ్డి 

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. శనివారం బెంగళూరులోని జగన్ నివాసానికి చేరకున్న పెద్దిరెడ్డి బొకే అందించి సన్మానించారు. తమ నాయకుడు ఇలాంటి వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. కాగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు వైభవంగా నిర్వహిస్తున్నారు.